Type Here to Get Search Results !

రసవత్తరంగా కొనసాగుతున్న జోన్ వన్ జోనల్ గేమ్స్.

 DBN TELUGU:- 


- రసవత్తరంగా కొనసాగుతున్న జోన్ వన్ జోనల్ గేమ్స్.


- మొదటి రౌండ్ పూర్తి చేసుకున్న 11 క్రీడాంశాలు.



- ప్రధాన క్రీడల్లో తలపడిన కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి,, మరియు ములుగు జిల్లాల టీం లు.


- రెండవ రోజు క్రీడల్లో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రధానం.


- మెడల్స్ అందజేసిన ఆర్ సి ఓ కొప్పుల స్వరూప రాణి. 


- కలర్ ఫుల్ గా కనిపించిన క్రీడా మైదానం.




- విద్యార్థుల చప్పట్లతో కోరెత్తిన పలు క్రీడల కోర్టులు.


- సాయంత్రం తెలంగాణ సాంస్కృతిక ప్రతీక బతుకమ్మలాడిన మహిళా ఉపాధ్యాయులు, అడుగు కలిపిన ఆర్సిఓ. 


తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ బెల్లంపల్లిలో జరుగుతున్న 9వ జోనల్ స్థాయి జోన్ 1 బాలుర క్రీడలు రసవత్తరంగా జరుగుతున్నాయి రెండవ రోజు ముగిసేనాటికి మూడు రౌండ్ల క్రీడాంశాల్లో మొదటి రౌండ్ ముగిశాయి. కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్ ఫుట్బాల్ హ్యాండ్ బాల్, పోటీలు నువ్వా నేనా అన్నట్టు సాగాయి రేపు మూడవరోజు సెమీఫైనల్స్ కి వస్తున్నట్లు గేమ్స్ వివరాలు ఇంచార్జ్ దాసరి ప్రసాద్ తెలిపారు శనివారం ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆర్ సి ఓ కొప్పుల స్వరూప రాణి ఆటలను తిలకించారు విద్యార్థులను వారి ప్రతిభను మరింత పదును పెట్టిన పిఈ టి, పిడిలను అభినందించారు.

 

-- తెలంగాణ ప్రతీక బతుకమ్మలాడిన సంక్షేమ గురుకుల ప్రిన్సిపల్స్.


- బెల్లంపల్లి సిఓఈ లో జరుగుతున్న 9వ జోనల్ గేమ్స్ క్రీడా మైదానంలో ఆదిలాబాద్ రీజియన్ లోని సంక్షేమ గురుకులాల మహిళా ప్రిన్సిపల్స్ మరియు ఉపాధ్యాయులు బతుకమ్మ లాడారు వారితో ఆర్ సి ఓ కొప్పుల స్వరూప రాణి వారితో అడుగు కలిపారు.


- 2వ రోజు క్రీడాపోటీల విజేతలు. 


--అండర్ 14.


క్యారమ్స్ క్రీడలో ప్రధమ, ద్వితీయ స్థానాలు వరుసగా ఆసిఫాబాద్,ఏటూరునాగారం లు పొందాయి.


చదరంగంలో ప్రధమ, ద్వితీయ స్థానాలు వరుసగా మథని,కోటపల్లి విద్యార్ధులు సాధించారు. 


షార్ట్పుట్ లో గోల్డ్,శిల్వర్,బ్రాంజ్ మెడల్స్ వరుసగా కె.సంకేత్ (కాసిపేట),జె.వరుణ్ సందేశ్ (జైపూర్),జె.సాయి కుమార్( ఆసిఫాబాద్)


డిస్కస్ త్రో లో గోల్డ్,శిల్వర్,బ్రాంజ్ మెడల్స్ వరుసగా కె.సంకేత్ (కాసిపేట),కె.మల్లిఖార్జున్(ఏటూరునాగారం),జె.ఠాగూర్(ఏటూరినాగారం)


200మీటర్స్ పరుగుపందం లో గోల్డ్,శిల్వర్,బ్రాంజ్ మెడల్స్ వరుసగా జె.వరుణ్ సందేశ్ (జైపూర్),జె.సాయి కుమార్(ఆసిఫాబాద్),ఏ.సాగర్(సిర్పూర్-టి).



--అండర్ 17.


షార్ట్పుట్ లో గోల్డ్,శిల్వర్,బ్రాంజ్ మెడల్స్ వరుసగా ఆర్.విక్కి( ఆసిఫాబాద్),కె.శ్రీనాద్(సిర్పూర్-టి),బి.రాహుల్ (కోటపల్లి)



--అండర్ 19.


షార్ట్పుట్ లో గోల్డ్,శిల్వర్,బ్రాంజ్ మెడల్స్ వరుసగా డి.శ్యాం సుందర్(కోటపల్లి),యల్.అభిలాష్(ఏటూరునాగారం),ఆర్.శివ(సిఓఈ బెల్లంపల్లి) 


ఇప్పటివరకు గెలుపొందిన విద్యార్థులకు ఆదిలాబాద్ రీజియన్ రీజనల్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ కొప్పుల స్వరూప రాణి మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సి ఓ ఈ బెల్లంపల్లి ప్రిన్సిపల్ ఐనాల సైదులు ఆదిలాబాద్ రీజన్లోని పలు గురుకులాల ప్రిన్సిపల్స్ లలిత కుమారి, పి జ్యోతి, సంధ్యారాణి, సంందారాజ స్వరూప,సంఘనపట్ల శ్రీనివాస్, వినోద్ సౌదా, ఊటూరి సంతోష్ , సీనియర్ ఉపాధ్యాయులు కోటి చింతల మహేశ్వరరావు, దూలం ఎల్లయ్య, గౌతమ్ జాడే, దశరథ రామ్, పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు పుదారి నగేష్ గౌడ్, గోగర్ల రమేష్, ఇప్ప రవి, అడ్డూరి వెంకన్న, రాజు తదితరులు పాల్గొన్నారు.







Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.