DBN TELUGU:- బెల్లంపల్లి నియోజకవర్గ తాండూర్ మండలంలోని మాదారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువజన అధ్యక్షులు నరేష్,
యువ నాయకులు అశోక్, కామలాకర్, భీమయ్య, మల్లయ్య, రమేష్, రాకేష్ , శివ కృష్ణ, ప్రవీణ్, ఆనంద్, ఆకాష్, వెంకటేష్, సంతోష్, దానిల్, మహిళా నాయకురాలు తీరుపతమ్మ, సుగుణ, వీరక్క, లక్ష్మి , మహిళలు దాదాపుగా ఇతర పార్టీలకు చెందిన 50 మంది వరకు తాండూర్ మండల మాజీ జెడ్పిటిసి సురేష్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... బెల్లంపల్లి నియోజకవర్గం లో ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధిని చూసి తాము బీఆర్ఎస్ పార్టీలో చేరామన్నారు. అలాగే రానున్న ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పార్టీ, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు.