DBN TELUGU:- దహెగాం మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట గత 9 రోజులుగా అంగన్వాడి టీచర్లు మరియు హెల్పర్లు రిలే నిరాహార దీక్ష చేస్తుంటే వారికి మద్దతు తెలిపిన బిజెపి దహెగాం మండల ప్రధాన కార్యదర్శి ఉంద్రి శ్రీకాంత్.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... 9 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న కూడ BRS రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోక పోవటం దారుణమన్నారు. వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. అంగన్వాడీలు గ్రామాల్లో కరోనా సమయంలో గానీ ఓటర్ లిస్టును ప్యూరిఫికేషన్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఏ పనైనా వారు సెలవులు లేకుండా కష్టపడి పనిచేస్తున్నారని గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబంలో ఏ సమస్య వచ్చినా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేది అంగన్వాడీ లేనని అంగన్వాడీ అంటే గ్రామంలో అమ్మ తర్వాత అమ్మలైన అంగన్వాడీలు గత 9 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తుంటే KCR మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవరిస్తున్నరు. కేసీఆర్ ప్రభుత్వం అంగన్వాడీలకు అనేక సార్లు హామీలు ఇచ్చి మోసం చేసిందని అంగన్వాడీలు చేస్తున్న కష్టం ఇంకెవరు ఎవరు చేయడం లేదని వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారి పనికి తగ్గ వేతనాన్ని ఇవ్వాలని, హెల్పర్లను 35 సంవత్సరాలుగా పనిచేస్తా ఉంటే పని చేయించుకొని ఉత్త పుణ్యానికే రిటైర్డ్ చేసేసి వెళ్లిపోవాల్సిదిగా ప్రభుత్వం భయపెట్టి పొమ్మనడం నిర్బంధ పాలన చేయడం సరికాదని, వారికి కుటుంబ పోషణ ఇబ్బంది అవుతుందని వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ను కల్పిస్తూ వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని KCR ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే వారు చేస్తున్న పోరాటానికి మా పార్టీ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో దళిత మోర్చా మండల ప్రధాన కార్యదర్శి డోంగ్రి గణపతి, బూత్ అధ్యక్షుడు జుమిడి మహేష్, దుర్గం నగేష్, బిజెపి నాయకులు కార్యకర్తలు అంగన్వాడీలు టిచర్లు తదితరులు పాల్గొన్నారు.