DBN TELUGU:- ఇటివల రోడ్డు ప్రమాదానికి గురైన సమత సైనిక్ దళ్ రాష్ట్ర నాయకులు & సమత ఫౌండేషన్ వ్యవస్థాపకులు డి.నగేష్ ని హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించి,
తక్షణ ఆర్థిక సహాయం క్రింద 25వేల రూపాయలు అందజేసి మరియు LOC మంజూరు చేపిస్తానని అలాగే వైద్యానికి అయ్యే పూర్తి ఖర్చు తానే భరిస్థానని హామీ ఇచ్చి వారి కుటుంబసభ్యులకు మనోధైర్యాన్ని ఇచ్చిన బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ నిరుపేదల కోసం ఎన్నో అభివృద్ధి పథకాలను తీసుకొచ్చిందని, ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉంటూ... ప్రజల కోసం పనిచేసే నాయకున్ని ఎన్నుకున్నప్పుడే, ఆ ప్రాంతం అభివృద్ధి పథంలోకి దూసుకుపోతుందని తెలిపాడు. ఈ కార్యక్రమంలో ఇతరులు పాల్గొన్నారు.