Type Here to Get Search Results !

ఫ్లాష్ న్యూస్: బిఆర్ఎస్ కు బిగ్ షాక్... కాంగ్రెస్ లోకి మాజీ మంత్రి...?

DBN TELUGU:- 

- టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా...!

- కాంగ్రెస్ పార్టీలోకి మాజీ మంత్రి...!

- సోనియా గాంధీ సమక్షంలో పార్టీలోకి చేరనున్న తుమ్మల.


తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార బిఆర్ఎస్ పార్టీకి షాకుల మీద శాఖలు తలుగుతున్నాయి. మాజీ మంత్రి, తుమ్మల నాగేశ్వరరావు టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తూ... రాజీనామా లేఖను సీఎం కేసీఆర్ కు పంపించారు.




చెన్నూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు గురువారం బిఆర్ఎస్ పార్టీని వీడి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాడు. అలాగే నేడు సోనియా, రాహుల్‌  సమక్షంలో ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయమైంది. హైదరాబాద్‌కు వస్తున్న ఏఐసీసీ అగ్రనేతలు సోనియా, రాహుల్‌గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. సీడబ్ల్యూసీ సమావేశాల ప్రారంభానికి ముందే తుమ్మల కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నట్లు పేర్కొన్నాయి. 
తుమ్మలను కాంగ్రెస్ లోకి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు ఆధ్వర్యంలో అధిష్ఠానం గత కొంతకాలంగా సంప్రదింపులు జరుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, పీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్‌ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విడివిడిగా తుమ్మల నివాసానికి వెళ్లి కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించారు. తుమ్మలతో సునీల్‌ కనుగోలు సంప్రదింపులు కొలిక్కి రావడంతో శుక్రవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, రేవంత్‌రెడ్డి, భట్టివిక్రమార్క, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, ఖైరతాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి తదితర నేతలు హైదరాబాద్‌లోని తుమ్మల నివాసానికి వెళ్లి కాంగ్రెస్‌ పార్టీలోకి ఆయనను లాంఛనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా తుమ్మలకు శనివారం మంచి రోజు కావడంతో ఆయన నేడు సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరెందుకు ముహూర్తం పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.