DBN TELUGU:-
- టికెట్ హామీ తోనే కాంగ్రెస్ లోకి వెళ్ళాడా...?
- ఇతర ఏదైనా పదవి ఆఫర్ చేశారా...?
- తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ పార్టీ: మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు.
చెన్నూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం చర్చనీయంగా మారింది.
రానున్న ఎన్నికలలో చెన్నూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ హామీ ఇవ్వడంతోనే మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరాడా...? లేకుంటే ఏదైనా ఇతర పదవి ఇస్తానని హామీ ఇవ్వడంతో బిఆర్ఎస్ పార్టీని వీడి... కాంగ్రెస్ పార్టీలో చేరాడ అనేది నియోజకవర్గ మొత్తంలో చర్చనీయా అంశంగా మారింది. చెన్నూరు నియోజకవర్గం లో చూసుకుంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా నూకల రమేష్, దుర్గం భాస్కర్, డాక్టర్ రాజా రమేష్, దాసరపు శ్రీనివాస్, రామిల్ల రాధిక, తదితరులు పోటీపడుతున్నారు. అయితే ఇప్పటికే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి టికెట్ ఇస్తారా...? లేకుంటే కాదని కొత్తగా చేరిన నల్లాల ఓదెలుకు పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుందా లేదా అనే విషయం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేపుతోంది.
ఈ వచ్చే ఎన్నికల ద్వారా రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజల కోరిక మేరకు తాను కాంగ్రెస్ లో చేరినట్లు తెలిపారు. ఏదేమైనా చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోకి నల్లాల ఓదెలు రావడంతో రానున్న ఎన్నికలలో ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.