DBN TELUGU:- కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని చింతలమానేపల్లి మండలంలో ఎస్సై మానవత్వం చాటుకున్న సంఘటన చోటుచేసుకుంది.
వివరాలు చూసుకుంటే... కౌటల రవీంద్రనగర్ ప్రధాన రహదారిపై చింతలపాటి వాగు సమీపంలో శుక్రవారం సాయంత్రం రెండు బైక్ లు వేగంగా ఎదురెదురుగా ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు కావడంతో విషయం తెలుసుకున్న చింతలమానేపల్లీ మండల ఎస్ఐ వెంకటేష్ సంఘటన స్థలానికి చేరుకొని అప్పటికే తీవ్రగాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న ఇద్దరినీ చూసి హాస్పిటల్ కు తరలించేందుకు ఎటువంటి వాహనాలు అందుబాటులో లేకపోవడంతో ఎస్సై తన సొంత వాహనంలోనే ఇద్దరినీ కౌటాలలోని ఆసుపత్రికి తరలించారు.