DBN TELUGU:- మంచిర్యాల జిల్లాలోని లక్షట్ పేట్ మండలంలోని ఉత్కుర్ గ్రామంలో కీర్తిశేషులు కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చైర్మన్ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో ఆడపడుచులకు సద్దుల బతుకమ్మ పండగ కానుకగా ట్రస్ట్ సెక్రెటరీ, డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ చీరలు పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గత ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ ప్రజలలోనే ఉంటూ ప్రజల కొరకై నిరంతరం తప్పిస్తూ సొంత ట్రస్టు ద్వారా ప్రతి సంవత్సరం దసరా కానుకగా ఆడపడుచులకు చీరలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అలాగే ఇలాంటి అవినీతికి తావు లేకుండా ప్రజలందరికీ సేవ చేయాలన్నదే ప్రేమ్ సాగర్ రావు లక్ష్యంగా పెట్టుకున్నారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి, గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 8,9 వార్డ్ కౌన్సిలర్లు రాందేని వెంకటేష్ , చిన్న వెంకటేష్, మాజీ సర్పంచ్ రాయలింగు, మండల అధ్యక్షులు పింగిలి రమేష్, లక్షెటిపేట పట్టణ అధ్యక్షులు ఎండి. ఆరిఫ్, మైనార్టీ అధ్యక్షులు నవాబ్ ఖాన్, యూత్ అధ్యక్షులు అంకతి శ్రీనివాస్, మండల, పట్టణ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.