వివరాల్లోకి వెళితే... మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు తిరిగి కాంగ్రెస్ గుటికి చేరుకున్నాడు. శుక్రవారం హైదరాబాదులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇంచార్జి ఠాక్రే తదితరుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన నేత ప్రస్తుతం ఒకే పార్టీలో ఇమిడి ఉండలేక ఇబ్బందులు పడుతున్నాడు. అలాగే ఆయన 2009లో నాటి టీఆర్ఎస్ టికెట్ పై గెలిచిన ఆయన ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ తో 2010లో రాజీనామా చేశారు. అదే ఏడాది జరిగిన ఉపఎన్నికలో గెలిచారు. 2014లోనూ గెలిచి ప్రభుత్వం చీఫ్ విప్ అయ్యారు. అలాగే 2018లో నిర్వహించిన ముందస్తు ఎన్నికలలో ఆయనను కాదని బాల్క సుమన్ కు టికెట్ ఇవ్వడంతో ఆయన రాజకీయ జీవితానికి పులిస్టాప్ పడినట్లు అయింది. ఆ తరువాత జరిగిన కొన్ని పరిణామాలలో 2022లో ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. ఏమైందో ఏమో తెలియదు కానీ మళ్లీ బిఆర్ఎస్ పార్టీలోకి చేరాడు. మళ్లీ ఇప్పుడు సంవత్సరం తిరగకముందే కాంగ్రెస్ పార్టీలో చేరడంతో చెన్నూర్ రాజకీయం హాట్ టాపిక్ గా మారింది.
బ్రేకింగ్ న్యూస్: బిఆర్ఎస్ కు భారీ షాక్... కాంగ్రెస్ లోకి మాజీ ఎమ్మెల్యే.
September 15, 2023
0
DBN TELUGU:- తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి బంగపడిన నేతలు మరో పార్టీ నుండి పోటీ చేయడానికి అవకాశాలు వెతుక్కుంటున్నారు.
Tags