DBN TELUGU:- మహబూబాబాద్ జిల్లాలోని ఇనుగుర్తి సాంఘిక సంక్షేమ శాఖ బాలికల హాస్టల్‌లో ప్రిన్సిపాల్ వేధింపులు తాళలేక అటెండర్ స్వరూప విష గుళికలు మింగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది.
ఈ ఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకోగా విషయాన్ని బయటకు రానీయకుండా ప్రిన్సిపాల్ జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. ఓవర్ డ్యూటీలు వేయడం, వ్యక్తిగత పనులు చేయించుకోవడం, అనారోగ్యంతో ఉన్నా సెలవు కావాలంటే ఇవ్వకుండా ఒత్తిడికి గురి చేయడం, ఇలాంటి వేధింపులతో సదరు మహిళ అటెండర్ ఆత్మహత్య చేసుకునేందుకు విష గుళికలు మింగినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని బయటకు తెలియకుండా ప్రిన్సిపాల్ సిబ్బందిని బెదిరించినట్లు తెలిసింది. బాధితురాలు కుటుంబ సభ్యులకు విషయం తెలియడంతో ఆమెను తోర్రూర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయంపై కేసముద్రం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు బాధిత కుటుంబ సభ్యులు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.