DBN TELUGU:- బెల్లంపల్లి మండలంలోని దుగ్నేపల్లి గ్రామంలో 12 లక్షల రూపాయల నిధులతో నూతన సీసీ రోడ్డు మరియు సైడ్ డ్రైనేజ్ నిర్మాణ పనులకు మరియు పెర్కపల్లి గ్రామంలో
30 లక్షల రూపాయల నిధులతో నూతన సీసీ రోడ్డు మరియు సైడ్ డ్రైనేజ్ నిర్మాణ పనులకు మరియు గ్రామంలో 18 లక్షల రూపాయల DMFT నిధులతో మహిళ సమాఖ్య భవన నిర్మాణ పనుల భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పనులను ప్రారంభించిన బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాము బెల్లంపల్లి మండలంలో ఎన్నో అభివృద్ధి పనులను చేశామని, రానున్న ఎన్నికలలో కూడా మళ్లీ బిఆర్ఎస్ పార్టీకే పట్టం కడితే... బెల్లంపల్లి మండలాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకువెళ్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ, ఎంపీపీ శ్రీనివాస్, వైస్ ఎంపీపీ రాణి-సురేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సత్యనారాయణ, ఇప్ప రావు, సర్పంచ్ లు సురేష్, పద్మావతి, రాయమల్లు, అశోక్ గౌడ్, ప్రమీల గౌడ్, నియోజకవర్గ అధికార ప్రతినిధి లక్ష్మణ్, మండల BRS పార్టీ అధ్యక్షులు గణేష్ గౌడ్, మాజీ AMC వైస్ చైర్మన్ రాజశేఖర్, నాయకులు అశోక్ గౌడ్, మల్లేష్, వెంకటస్వామి, వెంకటేష్ గౌడ్, వెంకన్న మరియు ఇతర ప్రజాప్రతినిధులు, BRS నాయకులు, స్థానిక గ్రామ ప్రజలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.