ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ... తెలంగాణలో గ్యారంటీలను రాష్ట్ర ప్రజల అభివృద్ధే లక్ష్యంగా అమలు చేస్తామని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని, అప్పుడే అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి సాధ్యమని, ఇదే తన కోరిక అని సోనియా గాంధీ ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ స్థానంలో నిలబెడతామని తెలిపారు. అలాగే ప్రజల అభివృద్ధి కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామని, ప్రజలను అభివృద్ధి చేయడం రాష్ట్రం ఇచ్చిన వాళ్లుగా తమ మీద బాధ్యత ఉన్నదని తెలిపారు.
- సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు ఇవే...!
-- మహాలక్ష్మి స్కీమ్ - మహిళలకు ప్రతి నెలా రూ. 2,000 సాయం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. రూ. 500కే వంట గ్యాస్ సిలిండర్.
-- రైతుభరోసా రైతులు, కౌలురైతులకు ఏటా రూ. 15,000 పంట పెట్టుబడి సాయం. వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ. 12,000 సాయం. వరి పంటకు ప్రతి క్వింటాలు రూ. 500 బోనస్.
-- గృహజ్యోతి ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు.
-- ఇందిరమ్మ ఇండ్లు లేనివారికి ఇంటి స్థలంలో నిర్మాణానికి రూ.5 లక్షల సాయం. ఉద్యమకారుల కుటుంబాలకు 250 చ.గజాల స్థలం కేటాయింపు.
-- యువ వికాసం విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు. ప్రతీ మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్.
-- చేయూత నెలకు రూ. 4,000 చొప్పున పింఛను. రూ. 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా.