DBN TELUGU:- టిడిపి అధినేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని అరెస్టు చేయడానికి తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే రాజాసింగ్.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి టిడిపి అధినేత చంద్రబాబు అంటే భయం పట్టుకుందని అందుకే కేసుతో సంబంధం లేకపోయినా ఆయనను అరెస్టు చేశారని అన్నారు. అలాగే చంద్రబాబును ఎంత తిట్టిన, ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తే.... అంత పైకి ఆయన ఎదుగుతాడని, రానున్న ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసేది టిడిపి ప్రభుత్వమేనని, ప్రజాసేవ చేయడం కోసమే చంద్రబాబు జైలుకు వెళ్లాడని తెలిపారు. ఆయన పైన పెట్టిన కేసులను త్వరలోనే కోర్టు కొట్టేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.