DBN TELUGU:- రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ ను రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపీఎస్,(డిఐజి), సందర్శించి పోలీసు స్టేషన్ పరిసరాలను పరిశీలించారు.
మొదట గౌరవ వందనం స్వీకరించి పోలీస్ స్టేషన్ పరిసరాలను, పోలీస్ స్టేషన్ పరిశీలించారు. సిబ్బంది తో మాట్లాడి క్రమశిక్షణగా విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని, పోలీసుస్టేషన్ నిర్వహణ, పోలీస్ స్టేషన్లలో 5S ఇంప్లిమెంటేషన్, ఫంక్షనల్ వర్టీకాల్స్ గురించి కోర్ట్ డ్యూటీ , రిసెప్షన్ , BC / పెట్రోల్ మొబైల్, టెక్ టీమ్స్ పనితీరు గురించి స్టేషన్ లోని వివరాలు మరియు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
డయల్ 100 కాల్ వచ్చినప్పుడు సంఘటన స్థలం కు వెళ్ళడానికి పట్టే సమయం లను బ్లూ క్లోట్స్ సిబ్బంది ట్యాబ్ లలో చెక్ చేయడం జరిగింది. అలాగే పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదయ్యే కేసుల సంబంధించి వివరాలను, పోలీస్ స్టేషన్ పరిధి, తరుచు ఉండే ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాల పనితీరు, నేరాల నియంత్రణ గురించి తీసుకుంటున్న నివారణ చర్యల గురించి ఎస్ఐ గారిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలు అందించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని, శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యత పోలీసులపై ఉందన్నారు. నేరాల నియంత్రణ కోసం సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజల్లో అవగాహన పెంచాలని అన్నారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల డిసీపీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ ఐపీఎస్, బెల్లంపల్లి ఏసీపీ పంతాటి సదయ్య, బెల్లంపల్లి రూరల్ సిఐ రాజ్ కుమార్ గౌడ్, బెల్లంపల్లి టూ టౌన్ ఎస్ఐ రవి కుమార్ హాజరయ్యారు.