DBN TELUGU:- నెన్నెల మండల కేంద్రం ఎంపిడిఓ కార్యాలయం వద్ద నిరవదీక సమ్మె చేస్తున్న అంగాన్ వాడి ఉద్యోగులకి మద్దతు తెలిపిన గొల్లపల్లి ఎంపిటిసి, మంచిర్యాల జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు బొమ్మెన హరీష్ గౌడ్.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అంగన్వాడీ కార్యకర్తలు ఈ అనారోగ్య రుగ్మతలను అరికట్టడానికి అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలకు గుడ్లు, పౌష్టికాహారం, ఫోలిక్ యాసిడ్ మాత్రలు, సమయానికి టీకాలు ఇప్పించడం ప్రసవం తర్వాత 6 సంవత్సరాల వయస్సు వరకు పిల్లలకు అవసరమైన పౌష్టికాహారం, టీకాలు, ఆట పాటల ద్వారా విద్య నేర్పుతూ పాఠశాలకు వెళ్లి చదువుకోడానికి మనసికంగా పిల్లల ను సిద్ధం చేయటంలో మరియు ఓటర్ జాబితానీ ఇంటింటికి తిరిగి సమాచారం సేకరించడం ఎలక్షన్ లో అంగన్వాడి కార్యకర్తలు అమోఘమైన సేవలు అందిస్తున్నారు. కావున వారు చేస్తున్న సేవలను గుర్తించి అంగన్వాడీ కార్యకర్తలకి కనీస వేతనం రూ.26వేలుగా నిర్ధారించాలి, ఉద్యోగ విరమణ వయసు 60 ఏళ్లకు కుదించాలి, విరమణ పొందిన ఉద్యోగికి రూ.10 లక్షలు, హెల్పర్కు రూ.5లక్షలు ఇవ్వాలి, రిటైర్మెంట్ నాటికి తీసుకునే వేతనంలో సగం మేర పెన్షల్లు, సీనియారిటీ ఆధారంగా వేతనాలను పెంపుతో పాటు ఇంక్రిమెంట్లు ఇవ్వాలి. ఐసీడీఎస్ పథకానికి నిధులు పెంచి మరింత బలోపేతం చేయాలి, ప్రతి మండల కేంద్రంలో ఐసీడీఎస్ భవనం నిర్మించాలి. అలాగే వీరికి నెలకొన్న సమస్యలను యుద్దప్రాతిపదికన పరిష్కరించాలి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.