DBN TELUGU:- చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దుర్గం భాస్కర్ చెన్నూరులో ప్రభుత్వ అసైన్డ్ భూమిలో పేద ప్రజలు వేసుకున్న గుడిసెలను సందర్శించడం జరిగింది.
ఈ సందర్భంగా దుర్గం భాస్కర్ మాట్లాడుతూ... చెన్నూరు మండలంలోని బావురావుపేట శివారు సర్వే నెంబరు 8లో 23 ఎకరాల ప్రభుత్వ అస్సైండ్ భూమిలో ఈ ప్రాంత పేద ప్రజలు సొంత ఇల్లు లేక గుడిసెలు వేసుకుంటే కెసిఆర్ దత్త పుత్రుడు, నియోజక వర్గ ఎమ్మెల్యే బాల్క సుమన్ అండతో కొందరు BRS పార్టీ నాయకులు వచ్చి గుడిసెల పై దౌర్జన్యం చేస్తూ పెట్రోల్ పోసి కాల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అన్నారు. అలాగే మరో పక్క రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ అని చెప్పి, గృహలక్ష్మి అని చెప్పి స్కీములు ప్రకటిస్తున్న అవి ఏవి కూడా పేద ప్రజలకు అందడం లేదని కేసీఆర్ ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెబుతూ అమాయక ప్రజలను మోసం చేస్తుందని, ఈ మోసాన్ని తెలంగాణ ప్రజలు గుర్తించి రాబోయే ఎన్నికల్లో BRS పార్టీకి తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. వెంటనే జిల్లా కలెక్టర్ ఈ ఘటనకు కారణమైన బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఇల్లు లేని పేద ప్రజలకు ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలూరి సంపత్, చెన్నూరి రాజేష్, కృష్ణమూర్తి, యెన్నం భాస్కర్, విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ చిప్పకుర్తి శ్రీనివాస్, అనపర్తి యువరాజు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సంకె రవి, జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రకాష్, జిల్లా కమిటీ సభ్యులు బోడంకి చందు, పట్టణ కార్యదర్శి ఎం డి అవేజ్, DYFI జిల్లా ఉపాధ్యక్షులు కే ప్రేమ్ కుమార్, నాయకులు నరేష్, దేవేందర్, ప్రసాద్, అభిరామ్, సురేందర్ మరియు గుడిసెల పోరాట ప్రజలు పాల్గొన్నారు.