DBN TELUGU:- మంచిర్యాల జిల్లా విద్యా శాఖ అధికారి కార్యాలయంలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో DEO సూపరింటెండెంట్ కి టెట్ పరీక్షను పగడ్బందీగా నిర్వహించాలని వినతిపత్రం అందజేయడం జరిగింది.
అనంతరం విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15 వ తేదీన నిర్వహించే టెట్ పరీక్ష ను అవకతవకలకు తావు ఇవ్వకుండా పకడ్బందీగా నిర్వహించాలని, అభ్యర్థులకు సరియైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, అభ్యర్థుల హాల్ టికెట్ లలో ఉన్నటువంటి పొరపాట్లను వెంటనే సరిచేసి వారికి పరీక్షలకు అనుమతించాలని అధికారులను కోరడం జరిగింది. అలాగే అభ్యర్థులు కూడా పరీక్ష కేంద్రాలకు గంట సేపు సమయం ముందే చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో TVUV రాష్ట్ర కార్యదర్శి చిప్పకుర్తి శ్రీనివాస్, OUJAC కోఆర్డినేటర్ దుర్గం మల్లేష్ పాల్గొన్నారు.