DBN TELUGU:- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే... ప్రకాశం జిల్లా లోని నాగులుప్పలపాడు మండలంలోని మద్దిరాలపాడు వద్ద 216 జాతీయ రహదారిపై ఆదివారం తెల్లావారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్ లారీని వేగంగా వస్తున్న బైక్ అదుపు తప్పి ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగి బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు మరణించారు. మృతి చెందిన వారి వివరాలు చూసుకుంటే ప్రకాశం జిల్లాలోని కొరిశపాడు మండలంలోని పమిడిపాడుకు చెందిన వారుగా గుర్తించారు. వినాయక విగ్రహం కోసం ఒంగోలు వచ్చి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.