DBN TELUGU:- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చక్రం తిప్పిన మాజీ పీసీసీ అధ్యక్షులు, బి ఆర్ ఎస్ మాజీ రాజ్యసభ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్ అస్వస్థత గురయ్యారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
డీఎస్ కుమారుడు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్వయంగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇటీవల అస్వస్థత గురైన డిఎస్ హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం డిఎస్ మరో మారు అస్వస్థతకు గురయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ చక్రం తిప్పిన రాజకీయ దిగ్గజం డిఎస్ రెండుసార్లు పిసిసి అధ్యక్షులుగా ఉండే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే కాకుండా పలు శాఖల మంత్రి హోదాలను నిర్వహించి, రాజకీయాల్లో నిజామాబాద్ జిల్లాను శాసించిన అపర మేధావి. నేటికీ డిఎస్ నేపథ్యంలోనే వారి తనయులు రాజకీయంగా తమ చాక చక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. భవిష్యత్తులోనూ వారి తనయులు జిల్లాలో ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. డి ఎస్ ఆరోగ్యం కుదుటపడాలని అయన ఇంకా పది కాలాలపాటు ఉండాలని, డీఎస్ అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు కోరుకుంటున్నారు.