DBN TELUGU:- స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా మంచిర్యాల జిల్లా IDOC కార్యాలయం సమావేశ మందిరం లో
ఉత్తమ ప్రతిభ కనబరచి గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చి దిద్దడం లో కృషి చేసినందుకు గాను బెల్లంపల్లి నియోజకవర్గంలోని కన్నెపల్లి మండలంలోని వీరాపూర్ సర్పంచ్ జిల్లెల అశోక్ గౌడ్ ని మరియు పంచాయతీ కార్యదర్శి తిరుపతి ని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు మరియు జిల్లా కలెక్టర్ సంతోష్ మరియు అడిషనల్ కలెక్టర్ సన్మానించి అవార్డు లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో సీఈఓ జడ్పీపి, డిఆర్డిఓ మరియు డిపిఓ, కన్నెపల్లి ZPTC కౌటారపు సత్యనారాయణ, ఎంపీడీఓ లు ఎంపీవో లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
