Type Here to Get Search Results !

సీఐటీయు- ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆఫీస్ ముట్టడి.

DBN TELUGU:-

- అంగన్వాడీ ఉద్యోగుల సమ్మె పై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి.

- అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి.

- అంగన్వాడీ ఉద్యోగుల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం.



అంగన్వాడీ ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ( సీఐటీయు- ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో సమ్మెలో భాగంగా గురువారం రోజున లక్షేట్టిపేట్ ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆఫీస్ ముట్టడి చేయడం జరిగింది. ఈ సందర్బంగా దుంపల రంజిత్ కుమార్ సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ... అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.



గత 3 రోజులుగా అంగన్వాడీ ఉద్యోగులు శాంతి యుతంగా సమ్మె చేస్తుంటే, సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వమే అంగన్వాడీ ఉద్యోగులను రేచ్చగొట్టే విదంగా అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టడం చాలా దారుణమని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమ్మె చేస్తున్న సంఘాలను చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే సమ్మె తీవ్రంగా ఉంటుందని దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిందిగా డిమాండ్. డిమాండ్ చేశారు. అలాగే ఈ సందర్భంగా ప్రసన్న (సీఐటీయు), సరస్వతి (ఏఐటీయూసీ ) జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ... తెలంగాణ రాష్టం వస్తే మా బ్రతుకులు బాగు పడతాయి అని అనుకున్నాం. కానీ నేటికీ ప్రభుత్వం మా బాధలు పట్టించుకోవడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఆడ బిడ్డలకు న్యాయం ఎక్కడుందో ప్రభుత్వం చెప్పాలి. మేము ఈ రోజు లక్షేట్టిపేట్ ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయనికి జన్నారం మండలం నుండి వస్తుంటే పోలీసులు మధ్యలో ఆపేసి, అందరిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ అక్రమ అరెస్టులను మేము ఖండిస్తున్నాం. అదే విదంగా ఈ రోజు ప్రాజెక్టు ఆఫీస్ ముట్టడి చేసాము. అధికారులను ఎవరిని లోపలికి పోనివ్వకుండా మధ్యాహ్నం వరకు అడ్డుకున్నాం అడ్డుకున్నాం. మమ్మల్ని అందరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం 26 వేలు, గ్రాడ్యూటీ చెల్లించాలి. పీఫ్, ఈ ఎస్ఐ మరియు రూ10 లక్షల ప్రమాద భీమ సౌకర్యాలు కల్పించాలి. ఆన్లైన్ పని విధానం రద్దు చేయాలి. జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలి. రిటైర్ మెంట్ టీచర్లకు రూ,10 లక్షలు, ఆయాలకు రూ,5 లక్షలు చెల్లించాలి. మా సెంటర్ తాళాలు పగలగొట్టాద్దని ఒక వేళ ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో మా సమ్మెను ఉదృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో రమణ రెడ్డి ఏఐటీయూసీ మండల నాయకులు, లక్ష్మి (సీఐటీయు) జిల్లా సీనియర్ నాయకురాలు, నస్రీన్ బేగం (సీఐటీయు) జిల్లా కమిటీ సభ్యులు, పద్మ, రాజేశ్వరి దండేపల్లి మండలం అధ్యక్ష కార్యదర్శులు, మండలం ఉపాధ్యక్షులు అనసూయ, మీనాక్షి, మండల కోశాధికారి పద్మ, కళావతి, భాగ్య, మండల సహాయ కార్యదర్శులు జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.