మంచిర్యాల జిల్లాలోని బిజెపి కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు వెరబెళ్ళి రఘునాథ్ చేతుల మీదగా నియామక పత్రాన్ని అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నా మీద నమ్మకంతో నన్ను కాసిపేట మండలానికి బిజెపి పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
అలాగే నాకు ఈ అధ్యక్ష పదవి రావడానికి సహకరించిన జిల్లా ప్రధాన కార్యదర్శి మునిమందా రమేష్ మరియు అసెంబ్లీ కన్వీనర్ రాచర్ల సంతోష్ మరియు దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే నా మీద నమ్మకంతో నాకు ఈ పదవి అప్పచెప్పినందుకుగాను నా వంతుగా పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని తెలిపారు.