స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏసీబీ కోర్టు కీలక తీర్పునిచ్చింది. ఆదివారం దాదాపు ఏడున్నర గంటలకు పైగా వాదన్నలు విన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి.. చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో పోలీసులు భారీ భద్రత నడుమ రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబును తరలిస్తున్నారు. నిన్న సాయంత్రం నుండి చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించిన సీఐడీ అధికారులు.. ఇవాళ తెల్లవారుజూమున ఏసీబీ కోర్టులో ఆయనను ప్రవేశపెట్టారు. చంద్రాబాబు రిమాండ్ రిపోర్ట్ను సీఐడీ అధికారులు కోర్టుకు సమర్పించారు. దీంతో ఇవాళ ఉదయం ఆరు గంటల నుండి ఏసీబీ కోర్టులో చంద్రబాబు రిమాండ్ రిపోర్ట్ పై వాదనలు మొదలయ్యాయి. చంద్రబాబు తరుఫున కోర్టులో ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా అండ్ టీమ్ వాదనలు వినిపించగా.. సీఐడీ తరుఫున పొన్నవోలు సుధాకర్ టీమ్ వాదనలు వినిపించారు. సుదీర్ఘ వాదనల అనంతరం తీర్పును రిజర్వ్ చేశారు. అనంతరం ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. అనంతరం మాజీ సీఎం చంద్రబాబుకు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.
బ్రేకింగ్ న్యూస్: చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్...!
September 10, 2023
0
DBN TELUGU:- ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారంలో ఉత్కంఠకు తెరపడింది.
Tags