DBN TELUGU:- భారతదేశంలోని ఢిల్లీలో జరుగుతున్న జీ20 కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం ప్రపంచ నేతలు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి మహాత్మాగాంధీకి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా ఆదివారం ఉదయమే రాజ్‌ఘాట్‌కు చేరుకున్న ఆయన వివిధ దేశాధినేతలకు సాదరంగా స్వాగతం పలికారు. ఢిల్లీలో తేలికపాటి వర్షం కురుస్తున్నా.. ఆయా దేశాల అధ్యక్షులు, ప్రతినిధులు నిర్ణీత సమయానికి రాజ్‌ఘాట్‌కు చేరుకొని అనంతరం మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పించే, అనంతరం ప్రత్యేక ప్రార్థనల నిర్వహించారు. ఈ కార్యక్రమం తర్వాత దేశ నాయకులంతా భారత్ మండపానికి చేరుకున్నారు. మండపంలోని సౌత్ ప్లాజాలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జీ20 మూడో సెషన్ 'వన్ ఫ్యూచర్' ను ప్రారంభించారు. ఢిల్లీలో జీ20 సమావేశాలు జరుగుతున్న సమయంలో వర్షం కురవడం అక్కడి అధికారులకు సవాలుగా మారింది.