DBN TELUGU:- భారతదేశంలోని ఢిల్లీలో నిర్వహించే జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం ఢిల్లీకి వచ్చిన బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ (Rishi Sunak) ఆదివారం ఉదయం అక్షర్‌ధామ్ ఆలయాన్ని దర్శించుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ పూజా కార్యక్రమాలకు ఆయన వెంట ఆయన సతీమణి అక్షతా మూర్తి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన రాక నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో ఢిల్లీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... హిందువుగా తాను చాలా గర్విస్తున్నానన్నారు. ఆ సంస్కృతిలోనే తాను పెరిగానని, తన విశ్వాసాలే ఒత్తిడి సమయంలో తనకు సాంత్వననిస్తాయని వివరించారు. అలాగే ఇటీవలే రక్షాబంధన్ నిర్వహించుకున్నట్లు వెల్లడించారు. తన చెల్లితో పాటు సమీప బంధువులు తనకు రాఖీలు కట్టినట్లు చెప్పారు. జన్మాష్టమి జరపుకొనేందుకు తనకు సమయం లభించలేదన్నారు.