DBN TELUGU:- చెన్నూరు కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే టికెట్ తనకే కేటాయించాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే కి విజ్ఞప్తి చేసిన TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గం భాస్కర్.
ఈ సందర్భంగా... సోమవారం గాంధీ భవన్ లో... కాంగ్రెస్ పార్టీ TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమ నాయకులు దుర్గం భాస్కర్ కి చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ MLA టికెట్ కేటాయించాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే ని కలిసి విజ్ఞప్తి చేశారు. వారు సానుకూలంగా స్పందిస్తూ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.... కాంగ్రెస్ పార్టీ యువ ఉస్మానియా విద్యార్థి ఉద్యమ నాయకులకు టికెట్లు కేటాయించాలనె రాహుల్ గాంధీ గత ఎన్నికల్లో ఇచ్చిన ఆదేశాల మేరకు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా గత ఎన్నికలలో రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమ నాయకుల కు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ తప్పకుండా టికెట్స్ కేటాయిస్తామని తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే హామీ ఇచ్చారు.