DBN TELUGU:- బెల్లంపల్లి నియోజకవర్గం లోని కాసిపెట్-2 గని లో "నా రక్షణ నా బాధ్యత మరియు నా కుటుంబ భద్రత" అంశం పై రక్షణ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమం లో బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ జీఎం శ్రీ కె హెచ్ ఎన్ గుప్తా గారు మాట్లాడుతూ.... ఉద్యోగులు భద్రత అనేది ఇంటి వద్ద నుండే మొదలవ్వాలి, ఇంటి వద్ద నుండి ద్విచక్రవాహనంపై వచ్చేటప్పుడే హెల్మెట్ తప్పకుండా ధరించి రావాలని కోరారు. మరియు పని స్థలాలలో కూడా SOP లు పాటిస్తూ zero harm దిశగా సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో SMTC ఇంఛార్జి శ్రీ జి. వి. ఎన్ విజయ్ కుమార్, కాసిపెట్ -2 గని మేనేజర్ లక్ష్మినారాయణ, ఫిట్ సెక్రటరీలు కారుకూరి తిరుపతి, బొద్దుల వెంకటేష్, సేఫ్టీ ఆఫీసర్, పిట్ ఇంజనీర్ మరియు ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భముగా సేఫ్టీ జీయం అధికారులతో 3 సీమ్ డిస్ట్రిక్ట్ పని స్థలాలు తనిఖీ చేశారు. పని స్థలాలలో గాలి సరఫరా మరియు రూఫ్ సపోర్టింగ్ గురించి విలువైన సూచనలు ఇవ్వడం జరిగినది.