DBN TELUGU:- మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలో 8వ తరగతి చదువుతున్న యువకుడు మిస్సింగ్ అయిన సంఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.... నేన్నెల మండలంలోని జెండా వెంకటపూర్ గ్రామానికి చెందిన పేరు ఎస్కురి వివేక్( తండ్రి పేరు ఎస్కురీ రంగయ్య) అనే విద్యార్థి బెల్లంపల్లి పట్టణంలోని రెసిడెన్షియల్ పాఠశాలలో 8 వతరగతి చదువుతున్నాడు. అయితే ఈ రోజు విద్యార్థిని ఇంటి దగ్గర నుండి హాస్టల్ కి తీసుకురాగా, హాస్టల్లోకి తీసుకువెళ్లకముందే, బయటి నుంచి బయటికి మధ్యాహ్న సమయంలో బెల్లంపల్లి బజారు ఏరియా వైపు వెళ్లినట్లు సమాచారం. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన దొరకలేదు. ఎవరికైనాా కనిపిస్తే వెంటనే 8790288150 ఈ నెంబర్ కి కాల్ చేసి తెలుపగలరని వారి తల్లిదండ్రులు కోరడమైనది.