DBN TELUGU:- గిరిజన మహిళపై పోలీసుల థర్డ్ డిగ్రీని తీవ్రంగా ఖండిస్తున్న:- బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్
- రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు.
- హోంమంత్రిని భర్తరఫ్ చేయాలి.
- పోలీసు అధికారులను విధుల నుంచి తొలగించాలి.
- బాధితురాలికి రూ.కోటి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్.
గిరిజన మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులను తక్షణమే ఉద్యోగం నుండి తొలగించి, బాధిత కుటుంబానికి రూ.కోటి నష్ట పరిహారం చెల్లించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున అర్థరాత్రి ఎల్బీనగర్ పోలీసుల థర్డ్ డిగ్రీలో తీవ్రగాయాలై బిఎన్ రెడ్డి నగర్ లోని శ్యామ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గిరిజన మహిళ వడ్త్య లక్ష్మీని ఆదివారం ఆయన పార్టీ శ్రేణులతో కలిసి పరామర్శించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ... ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే, ఆమె పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించిన తీరు అమానవీయమన్నారు. రాత్రంతా పోలీస్ స్టేషన్ లో ఉంచి థర్డ్ డిగ్రీ ప్రయోగించి, మహిళపై మోకాళ్లు, పిక్కలు, తొడలపై లాఠీలతో చితకబాదడం దుర్మార్గమన్నారు. నగరం నడిబొడ్డున జరిగిన సంఘటనకు నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే హోంమంత్రిని భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమండ్ చేశారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు ఇటీవల హైదరాబాద్ పాత బస్తీకి చెందిన సామజిక కార్యకర్త హత్య షేక్ సయీద్ బావజీర్ ను బండ్లగూడలో హత్యకు గురయ్యాడన్నారు. హత్యకు ముందే హోం మంత్రికి మహమూద్ అలీకి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసిన అతని ప్రాణాలు పోలీసులు కాపాడలేకపోయారని విమర్శించారు. దొంగతనం కేసులో అరెస్టు ఖదీర్ ఖాన్, మరియమ్మ లాకప్ డెత్ లు పోలీసుల హత్యలేనన్నారు. పోలీసులు కేవలం బహుజనుల మీదనే దాడులకు పాల్పడుతున్నారు. కానీ లిక్కర్ స్కాంలో రూ.100 కోట్లు ముడుపులు చెల్లించిన కవితను మాత్రం ఈడీ పోలీసులు ఆమె ఇంటికి వెళ్ళి విచారించారని విమర్శించారు. దేశంలో ఎక్కడో సంఘటన జరిగితే స్పందించే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటిఅర్ నగరంలో జరిగిన జరిగిన సంఘటనకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బాధితురాలి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. పరామర్శించినవారిలో రాష్ట్ర కో ఆర్డినేటర్ డా.వెంకటేష్ చౌహన్, రాష్ట్ర నాయకులు గుండెల ధర్మేందర్, అధికార ప్రతినిధి అరుణ, జిల్లా ఇంచార్జ్ మహేష్ చారి, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు చాట్ల చిరంజీవి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పి. లింగం స్వేరో, lb నగర్ ఇంచార్జ్ జక్క యాదగిరి, మహేశ్వరం నియోజకవర్గ అధ్యక్షులు గుడ్ల శ్రీనివాస్ మహారాజు,ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అధ్యక్షులు గ్యార మల్లేశ్,మహిళ కన్వీనర్ మాధవి,సంపత్,శశి,రవికుమార్, ప్రహ్లాద్, చిత్రం కృష్ణ, బంగారి మైసయ్య,జెనిగే విష్ణు,నరేష్ ముదిరాజు, అంజన్ కుమార్, Bvf వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.