DBN TELUGU:- తెలంగాణ రాష్ట్రంలోని మహానగరమైన హైదరాబాద్‌లో చెవిటి, మూగ మహిళను బంధించి ఓ యువకుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ హుమయూన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయ నగర్ కాలనీలో ఈ దారుణం చోటుచేసుకుంది. సాయి అనే యువకుడు చెవిటి, మూగ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మహిళను బాత్ రూంలో బంధించి అత్యాచారం చేసి. అనంతరం ఆమెను లోపలే ఉంచి గడియ పెట్టి పారిపోయాడు. బాధిత మహిళ భర్త కూడా మూగ వాడే కావడం గమనార్హం. అయితే.. గతంలో అనేక సార్లు అతడిపై ఫిర్యాదు చేశామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హుమయూన్ నగర్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామన్నారు.