DBN TELUGU:- శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 108 మియాపూర్, 109 హాఫిజ్పేట్ డివిజన్ల,శక్తి కేంద్ర మరియు బూత్ అధ్యక్షుల సమావేశం నిర్వహించడం జరిగింది.
బీజేపీ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా MLA ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంటెస్టడ్ ఎమ్మెల్యే మొవ్వా సత్యనారాయణ ఆధ్వర్యంలో మియాపూర్ పార్టీ ఆఫీస్ నందు నిర్వహించిన అసెంబ్లీ స్థాయి సమావేశానికి ముఖ్య అతిధిగా కర్ణాటక రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత MLA ముని రత్న నాయుడు వీచేయడము జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఈ మూడు నెలలు పూర్తి సమయం పార్టీకి కేటాయించి ఒక్కొక్క నాయకుడు 100 ఓట్లు పోలింగ్ బూతుల్లో వేయించాలన్నారు. అలాగే చాలామంది నాయకులు పేపర్లలో పెద్ద ప్రకటనలు వేయించుకొని తిరుగుతూ హల్చల్ చేస్తారు, కానీ ప్రజల్లో మాత్రం వారికి వ్యతిరేకత ఉంటుందన్నారు. ప్రజల కోసం సేవ చేసే నాయకులు, అందుబాటులో ఉండే నాయకులతోనే సమాజానికి ఉపయోగం ఉంటుంది అని తెలియజేయడము జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు,బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇంచార్జిలు, మోర్చా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.