DBN TELUGU:- రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గల గాయత్రి డిగ్రీ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు గురువారం డ్రగ్స్ పై అవగాహన ప్రోగ్రాం నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిరిసిల్ల డి.ఎస్.పి ఉదయ్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.... డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలు గురించి, డ్రగ్స్ కు యువత ఏ విధంగా బానిసలు అవుతున్నారు అని, డ్రగ్స్ లాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని, మొదలైన విషయాల గురించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి డ్రగ్స్ ను ఏ విధంగా అరికట్టాలని విద్యార్థులకు పోలీసు అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట సర్కిల్ సిఐ శశిధర్ రెడ్డి, ఎల్లారెడ్డిపేట ఎస్ఐ రామాకాంత్, గాయత్రి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ నాగేందర్ రావు మరియు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.