DBN TELUGU:- రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని హరిదాస్ నగర్ గ్రామంలో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రెండవ విడత గొర్రెల పంపిణీలో భాగంగా రెండవ విడతలో 51 యూనిట్లు మంజూరు కాగా నాలుగు యూనిట్లు గొర్రెలులను తీసుకురావడంతో. ఆ గొర్రెలను జెడ్పిటిసి చీటీ లక్ష్మన్ రావు పరిశీలించి మాట్లాడుతూ యాదవుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం గొర్రెలు పంపిణీ చేస్తుందని, ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
మండల పశు వైద్యాధికారిని రేణుక కు పలు సూచనలు చేస్తూ వర్షాకాలంలో గొర్రెలకు వ్యాక్సిన్లు సమయం ప్రకారం ఇవ్వాలని, ఈ గొర్రెలు చాలా దూరం నుండి తీసుకురావడం వలన ట్రాన్స్ పోర్టు సమయంలో ఏవైనా గొర్రెలు చనిపోయినచో వాటిని ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయించవలసిందిగా జడ్పిటిసి లక్ష్మణ్ రావు సూచించారు.
ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారిని రేణుక , సర్పంచ్ తెడ్డు అమృత రాజమల్లు, యాదవ సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు చిర్రం నాగరాజు యాదవ్, సిరికొండ నాగరాజు, యాదవ సంఘం నాయకులు మానుక దేవయ్య, వట్టెల అశోక్, బొల్లు పరశురాములు, వట్టెల పద్మ, గంటయ్య, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.