DBN TELUGU:- తెలంగాణ రాష్ట్రంలోని కొడంగల్ నియోజకవర్గం లో స్కూలుకు వెళ్లే సమయంలో 15 మంది చిన్నారులపై పిచ్చికుక్క దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే... కొడంగల్ నియోజకవర్గంలోని బొమ్మరస్పెట్ మండలంలోని రేగడి మైలారం గ్రామంలో గురువారం ఉదయం స్కూల్ కి వెళ్లే క్రమంలో పిచ్చికుక్క దాడి చేయడంతో 15 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. ఇందులో ఆరుగురు చిన్నారులను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించగా మిగతా విద్యార్థులందరినీ దగ్గరలోని ప్రవేట్ ఆసుపత్రులకు తరలించారు.