Type Here to Get Search Results !

ఫ్లాష్ న్యూస్:- ఆరేళ్ల చిన్నారిపై చిరుత దాడి... చిన్నారి మృతి...!

DBN TELUGU:- తిరుమల కొండపైకి అలిపిరి నడకదారిలో వెళుతుండగా లక్షిత అనే ఆరేళ్ల చిన్నారి తప్పిపోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది.



వివరాల్లోకి వెళితే.... నెల్లూరు జిల్లా కొవ్వూరుకు చెందిన లక్షిత కుటుంబం రాత్రి నడక మార్గంలో తిరుమల కొండపైకి బయలు దేరింది. కాలినడకన తిరుమలకు వస్తున్న క్రమంలో రాత్రి 7:30 గంటల సమయంలో లక్షిత అనే ఆరేండ్ల అమ్మాయి తప్పిపోయింది. ఆమె తప్పిపోయిన వెంటనే రాత్రి 10 గంటల వరకూ పాప కోసం వెతికిన దొరకకపోవడంతో వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు చిన్నారి కోసం పోలీసులు గాలించగా చర్యలు చేపట్టగా శనివారం ఉదయం నరసింహ స్వామి ఆలయం వద్ద చెట్ల పొదల్లో చిన్నారి మృతదేహం లభించింది. ఒంటిపై గాయాలు ఉండటంతో పాపను చిరుత చంపేసి ఉంటుందని భావిస్తున్నారు. పాప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇదే ప్రాంతంలో నెల క్రితం ఓ బాలుడిపై చిరుత దాడి చెయ్యగా, ఇప్పుడు కూడా మళ్లీ అదే ప్రాంతంలోనే చిన్నారి కూడా తప్పిపోవడం గమనార్హం. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.