DBN TELUGU:- పెద్దపల్లి జిల్లాలోని మంథని మండలంలోని ఎక్లాస్పూర్ సమీపంలోని గాడుదుల గండి గట్టుపై ఆదివారం ఉదయం రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని కారు ఢీకొనడంతో ప్రమాదంలో ఒకరు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.... మంథని మండలంలోని ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన సంపత్ రెడ్డి ఎక్లాస్పూర్ నుంచి సమీపంలోని గండివైపు మార్నింగ్ వాకింగ్ కోసం నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో వెనుక నుండి కారు ఢీ కొనడంతో సంపత్ రెడ్డి అనే వ్యక్తి సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి మంథని లోని HDFC బ్యాంక్ లో సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తున్నట్టు తెలిసింది. ఈ యొక్క ప్రమాదమునకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.