DBN TELUGU:- తాడిపత్రి-అనంతపురం రహదారిలోని రావివెంకటాంపల్లి దగ్గర శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి ముగ్గురు మరణించిన సంఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.... తాడిపత్రికి చెందిన మోహన్ రెడ్డి కారు అతి వేగంతో వచ్చి గ్రామంలోని ఓ మలుపులో రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొని బోల్తా పడింది. ప్రమాదంలో కారులో ఉన్న నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా, శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదం జరగడానికి గల కారణాలు పరిశీలిస్తే... మోహన్ రెడ్డి అనే వ్యక్తి సెకండ్ హ్యాండ్ కారును నిన్న కొనుగోలు చేశాడు. దీంతో తన స్నేహితులతో కలిసి రావికటాంపల్లి సమీపంలో రాత్రి పార్టీ చేసుకున్నట్లు తెలిసింది. ఆ సమయంలో వారు ఫుల్లుగా మద్యం సేవించినట్లు తెలిసింది. తన ముగ్గురు స్నేహితులకు మందు పార్టీ ఇచ్చి, మద్యం మత్తులో అందరూ అర్ధరాత్రి తాడిపత్రికి తిరిగి కారులో వస్తూ ఉండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.