DBN TELUGU:- భార్య భర్తల మధ్య మనస్పర్థలతో వనపర్తి పట్టణానికి చెందిన చర్మవ్యాధి నిపుణురాలు లక్ష్మి కుమారి సోమవారం మౌన పోరాటానికి దిగారు.
కుటుంబ కలహాలతో సతమతమవుతున్న ఆమె భర్త, కుటుంబ సభ్యులపై పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. సమస్య పరిష్కరానికి సామాజిక పెద్దలతో చర్చలు జరిపిన ఫలితం లేకుండా పోయింది. తన సమస్య పరిస్కారం అయ్యేంత వరకు పోరాటం చేస్తానంటూ క్లినిక్ మూసి మెట్లపై మౌన పోరాటం చేపట్టారు. ఈ విషయం వనపర్తి జిల్లా కేంద్రంలో చర్చనీయంశంగా మారింది. భార్య భర్తల మధ్య వచ్చిన మనస్పర్థల వల్ల తనకు న్యాయం చేయాలని ఓ మహిళా డాక్టర్ మౌన పోరాటానికి దిగడం హాట్ టాపిక్ గా మారింది.