DBN TELUGU:- వయసుకు సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
తాజాగా ఖమ్మం నగరంలో శ్రీదర్(31) అనే యువకుడు ఈ రోజు ఉదయం జిమ్‌కి వెళ్లి ఇంటికి వచ్చాడు. అంతలోనే తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్రత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే యువకుడు మృతి చెందాడు. యువకుడిని చూసిన వైద్యులు గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారణ చేశారు. మృతుడు శ్రీధర్ తండ్రి ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా గతంలో పనిచేశారు. యువకుడు గుండెపోటుతో మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.