DBN TELUGU:- హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో ఘోర ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే... సోమవారం ఉదయం ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగాయి.
దీంతో ప్రమాదాన్ని వెంటనే గమనించిన ఇద్దరు యువకులు కారులోంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని యువకులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదమునకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.