DBN TELUGU:- మహారాష్ట్రలోని పాల్ఘర్ రైల్వే స్టేషన్ సమీపంలో జైపూర్ – ముంబై ఎక్స్‌ప్రెస్ రైలులో జరిగిన కాల్పులలో నలుగురు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది.
వివరాలు చూసుకుంటే... మరణించిన వారిలో ఒక ఆర్పీఎఫ్ ఏఎస్ఐ, ముగ్గురు ప్రయాణీకులు ఉన్నారు. తెల్లవారు జామున 5గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు జైపూర్ నుంచి ముంబై వెళ్తున్న క్రమంలో కాల్పులు జరిగినట్లు తెలిసింది. అయితే, ఈ కాల్పులు జరిపింది ఆర్పీఎఫ్ (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) కానిస్టేబుల్ చేతన్ సింగ్‌గా గుర్తించారు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానిస్టేబుల్ మానసిక ఒత్తిడికి గురవుతున్నాడని చెబుతున్నారు.