DBN TELUGU:- ట్విట్టర్లో మంటలు పుట్టిస్తున్న కేటీఆర్...."కేసీఅర్ నినాదం…మూడు పంటలు"… "కాంగ్రెస్ విధానం…మూడు గంటలు"… "BJP విధానం“మతం పేరిట మంటలు" మీకేం కావాలి...! "మూడు పంటలు కావాలా" "మూడు గంటలు కావాలా" "మతం పేరిట మంటలు కావాలా..."
తెలంగాణ రైతు… తేల్చుకోవాల్సిన.. తరుణం ఇది..!! అంటూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ ట్విట్టర్ చేసిన ట్విట్ ఇప్పుడు మంటలు పుట్టిస్తున్నది.. బిజెపి,కాంగ్రెస్ లను టార్గెట్ చే స్తూ చేసిన ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ గా దూసుకుపోతున్నది.
ఇక కాంగ్రెస్‌కు ఎప్పుడూ చిన్నకారు రైతులు అంటే చిన్న చూపు అని.. సన్నకారు రైతు అంటే సవతి ప్రేమ అని కెటిఆర్ అన్నారు. నాడు ఏడు గంటల కరెంట్ ఇవ్వకుండా ఎగ్గొట్టిన కాంగ్రెస్.. నేడు ఉచిత కరెంట్‌కు ఎగనామం పెట్టే కుట్ర చేస్తోందని పేర్కొన్నారు. మూడు గంటలతో మూడెకరాల పొలం పారించాలంటే బక్కచిక్కిన రైతు బాహుబలి మోటార్లు పెట్టాలని ఎద్దేవా చేశారు. అరికాలిలో మెదడు ఉన్నోళ్లను నమ్ముకుంటే రైతుల బతుకు ఆగమవుతుందని అన్నారు. మరోసారి రాబందు 3 గంటల మాటెత్తితే.. రైతుల చేతిలో మాడు పగలడం ఖాయమని స్పష్టం చేశారు. తెలంగాణ రైతన్నలకు ఇది పరీక్షా సమయం అని కేటీఆర్ పేర్కొన్నారు. రైతును రాజును చేసే మనసున్న సీఎం కేసీఆర్ కావాలా...? మూడు గంటల కరెంట్ చాలన్న మోసకారి రాబందు కావాలో నిర్ణయించుకోవాలని సూచించారు.