DBN TELUGU:- జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నాని టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన కేసీఆర్.
దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తున్నది. తమిళనాడులోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్రముఖ సినీ హీరోతో చర్చలు జరిపినట్లు సమాచారం. కొన్ని వారాలుగా తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి త్వరలోనే పొలిటికల్ గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారని జోరుగా ప్రచారం వినిపిస్తున్నది. ఈ ప్రచారానికి మరింత బలం చేకూరేలా ఈ మధ్య కాలంలో ఆయన చేసే కార్యక్రమాలు ఆసక్తిని పెంపొందిస్తున్నాయి.