DBN TELUGU:- వీడియోలు చేస్తూ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తుందని చెల్లిని రోకలిబండతో అన్న కొట్టి చంపిన సంఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.... ఖమ్మం జిల్లాలోని ఇల్లందు కు చెందిన అజ్మీర సింధు అనే అమ్మాయి ఏఎన్ఎం గా పనిచేస్తుంది. అయితే ఆమె ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ ను క్రియేట్ చేసుకుని అందులో ఆమె వీడియోస్ అప్లోడ్ చేస్తుంది... ఆమె సోదరుడు అయినా హరిలాల్ యూట్యూబ్ లో వీడియోలు అప్లోడ్ చేయవద్దు అని చెప్పిన వినకుండా ఆమె అప్లోడ్ చేయడంతో కోపానికి గురైన సోదరుడు ఆమె తలపై రోకలిబండతో బాధడంతో... గాయాలైన ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.