DBN TELUGU:- ఐటీ రంగంలో హైదరాబాద్‌కు మని హారంగా చెప్పుకునే హైటెక్ సిటీ భవనం ఎదురుగా ట్రాఫిక్ బూత్‌లో పట్ట పగలే మద్యం సేవించి పోలీస్ నిఘాకు సవాలు విసిరారు.
ఈ ఫోటోలు, వీడియో ఈ రోజు ఉదయం నుంచి వైరల్‌గా మారింది. ఇద్దరు మందు బాబులు ట్రాఫిక్ బూత్‌లో మద్యం, బిర్యానీలు భయం, జంకూ లేకుండా తాపిగా తాగేసారు. ఇది చూసిన నగర ప్రజలు పోలీసు నిఘాపై విమర్శలు గుప్పించారు. అయితే ఈ వీడియో పాతదా...? లేదా వారం రోజుల కిందట జరిగిందా...? అనే విషయాన్ని పోలీసులు నిర్దారించాల్సి ఉంది. ఇలా ప్రతి చోట మద్యం దుకాణాల వద్ద మందుబాబుల చిత్ర, విచిత్ర చేష్టలు సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.