DBN TELUGU CHANNEL:- భారతదేశంలోని లఖ్ నవూ వేదికగా భారత్, సౌతాఫ్రికా జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ రద్దయింది.
ఎకానా స్టేడియం పరిసర ప్రాంతాల్లో పొగమంచు ప్రభావం అధికంగా ఉండటంతో కనీసం టాస్ వేయకుండానే మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ఎంపైర్లు ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 6.30 గంటలకు టాస్ వేయాల్సి ఉండగా పొగ మంచు ప్రభావంతో ఎక్కువగా ఉండడంతో ఎంపైర్లు పలుమార్లు మైదానం లోనికి వచ్చి పరిస్థితులను పరిశీలించారు. కానీ పొగ మంచు ఎక్కువగా ఉండడంతో వాతావరణ పరిస్థితుల్లో ఎటువంటి మార్పు లేకపోవడంతో మ్యాచ్ను రద్దు చేస్తునట్లు ప్రకటించారు. సిరీస్ లో చివరి (ఐదో) టీ20 శుక్రవారం (డిసెంబర్ 19న) అహ్మదాబాద్లో జరగనుంది. ప్రస్తుతం సిరీస్ లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది.
