DBN TELUGU CHANNEL:-
• బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అకాడమిక్ ఆడిట్.
• డిపార్ట్మెంట్ల వారీగా రికార్డులను పరిశీలించిన అడ్వైజర్లు డాక్టర్ ఎం.వి. పట్వర్ధన్, కిషోర్ కుమార్.
• వివరాలు వెల్లడించిన ప్రిన్సిపాల్ డాక్టర్ కాంపల్లి శంకర్.
> మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో సోమవారం 2022-23 మరియు 2023-24 విద్యా సంవత్సరాలకు సంబంధించిన అకాడమిక్ ఆడిట్ జరిగింది. అకాడమిక్ అడ్వైజర్లుగా చెన్నూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.వి. పట్వర్ధన్, అదే కళాశాలకు చెందిన సీనియర్ ఫిజిక్స్ లెక్చరర్ కిషోర్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ల వారీగా రికార్డుల నిర్వహణ తీరును పరిశీలించారు.
> బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలకు సంబంధించి 2022-23 విద్యా సంవత్సరంతో పాటు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన అన్ని రకాల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయా డిపార్ట్మెంట్ల అకాడమిక్ ప్లానింగ్, విద్యార్థుల ఉత్తీర్ణత, మరియు వారిని కేంద్రీకృతంగా చేసుకొని నిర్వహించిన వివిధ కార్యక్రమాల రికార్డులు అన్నిటినీ ఒక్కొక్కటిగా చూశారు. కళాశాల మొత్తానికి సంబంధించిన రికార్డులను కూడా పరిశీలించారు. సాయంత్రం ఎగ్జిట్ మీటింగ్లో అకాడమిక్ నిర్వహణకు సంబంధించి అవసరమైన పలు సలహాలు, సూచనలు కూడా చేశారు. ఈ అకాడమిక్ ఆడిట్లో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కాంపల్లి శంకర్, వైస్ ప్రిన్సిపాల్ మేడ తిరుపతి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అధ్యాపకులు, సూపరింటెండెంట్, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

