DBN TELUGU CHANNEL:-
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 17 న అనగా రేపు మధ్యాహ్న 3 గంటలకు సచివాలయంలో సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణతో పాటు ఇతర కీలక అంశాలపై చర్చించి ఈ భేటీలో ఏదో ఒక నిర్ణయం తీసుకోనుంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వగా దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించిన ఫలితం లేకపోయింది. రేపు జరగనున్న మీటింగ్ లో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ఏం చేయాలి, ఏ విధంగా ముందుకెళ్లాలనే విషయంపై మంత్రుల అభిప్రాయాన్ని తీసుకుంటామని ఇది వరకే సీఎం ప్రకటించారు.
కులగణన ఆధారంగా బీసీ లకు 42శాతం రిజర్వేషన్లు కేటాయించినా కేంద్రం బీసీ బిల్లులకు ఆమోదం తెలపడం లేదు. రిజర్వేషన్లను 50 శాతానికి పెంచేలా పంచాయతీరాజ్చట్టసవరణకు గవర్నర్సైతం ఆమోదం తెలపడం లేదు. హైకోర్టు 50శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కు సూచించింది. వీటితో పాటు 50శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును ఎన్నికల సంఘం అమలుచేయడం లేదని కోర్టులో పిటిషన్దాఖలైంది. ఈ కేసు విచారణ ఈనెల 24కు వాయిదాపడింది.
ఆ రోజు స్థానిక సంస్థల ఎన్నికల అంశం కోర్టులో విచారణకు రానుంది. గత విచారణ సమయంలో ప్రభుత్వానికి మరికొంత సమయం కావాలని అడగడంతో కేసును గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తప్పనిసరిగా కోర్టుకు ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉండటంతో కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
