- కోనంపేటలో దారుణం... 17 సంవత్సరాల యువకుడు మృతి.
మంచిర్యాల జిల్లాలోని నెన్నల మండలంలో రోడ్డు సరిగా లేక... సరైనోడు సమయానికి వైద్యం అందక యువకుడు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.
వివరాలు చూసుకుంటే... నెన్నెల మండలంలోని కోణంపేట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ జింజిరి బాపు - బుజ్జక్క దంపతుల రెండవ కుమారుడు జస్వంత్ (17సం) చేనుకు పోయి వచ్చే క్రమంలో అనారోగ్యానికి గురయ్యాడు గమనించిన స్థానికులు అంబులెన్స్ కి ఫోన్ చేయగా మార్గం మద్యవరకు వచ్చింది.
చీమరాగల్ల ప్రాంతం వద్ద బురదగా మారడంతో అటు వైపు నుండి రావాలి అనడంతో దిక్కు లేక కచ్చులం బండి లో వేసుకుని అంబులెన్స్ వద్దకు చేరుకోగా అప్పటికే యువకుడు మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు బంధుమిత్రులు, అలాగే సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.