DBN TELUGU:-
- ప్రాణాలు అడ్డం పెట్టీ అయిన ఓపెన్ కాస్ట్ బొగ్గుగని అడ్డుకుంటాం.
- నేతకని సంగం రాష్ట్ర కార్యదర్శి సోదారి తిరుపతి.
నెన్నెల మండలంలోని శ్రవనపల్లి గ్రామంలో ఓపెన్ కాస్ట్ నీ అడ్డుకొని తీరుతామని నేతకాని సంగం రాష్ట్ర కార్యదర్శి సోదరి తిరుపతి ఆరోపించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ... ఒక పేద గ్రామం నిరుపేదలు బడుగు బలహీన వర్గాలకు చెందిన లంబాడి తండ ఇక్కడ కేవలం వరి సాగు చేసుకొని , మామిడి తోటల మీద వారి కుటుంబం పోషణ సాగుతుంది. ఇక్కడ ఓపెన్ కాస్ట్ స్టార్ట్ చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. చుట్టూ పక్కల గ్రామాల్లో అన్ని కూడా కేవలం రైతుకు వరి పంట మీద వారి జీవన ఆధారం కొనసాగుతుందని, మా లాంటి చిన్న చిన్న గ్రామాల్లో ఇలా చేయడం సరికాదన్నారు. అన్నం పండించే రైతుల్లో వారి నోట్లో మట్టి కొట్టినట్లు అవుతంది అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ యొక్క బొగ్గు గని నీక్షేపన్ని తక్షణమే ఆపాలని విన్నవించారు. ఎవరు వచ్చినా ఊర్లో అడుగు పెట్టే ప్రసక్తి లేదని, జై జవాన్ జై కిసాన్ అని నినాదంతో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.ఇక్కడ కేవలం ఎస్సీ ఎస్టీ లు ఎక్కువగా నివసించే గ్రామాలు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ బ్రతికే కూలీలు వారి జీవితాల్లో చీకటి కమ్మే విధంగా చేయవద్దని అన్నారు. బొగ్గు లేకున్నా బ్రతుకవచ్చు కానీ అన్నం పండించే రైతులు అన్నం పండిచకపోతే ఎలా బ్రతుకుతారు అని అన్నారు.